మహానాడుకు మహా శోభ..

మహానాడుకు మహా శోభ..

  • సీతమ్మవారి పాదాల వద్ద భారీ కటౌట్..
  • ఏర్పాటుచేసిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న..
  • నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత
  • తొలి మహానాడు వేళ ప్రత్యేక ఆకర్షణ..

భవానిపురం, ఆంధ్రప్రభ: టీడీపీ మహానాడు వేడుకలకు విజయవాడలో రాజకీయ ఉత్సాహం ఉప్పొంగుతోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో నగరంలో ప్రత్యేక వాతావరణం నెలకొంది.

ఈ నేపథ్యంలో మంగళవారం విజయవాడలోని సీతమ్మవారి పాదాలు ప్రాంతం సమీపంలో ఇసుక దిబ్బల వద్ద తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో 150 అడుగుల భారీ కటౌట్‌ను ఆవిష్కరించనున్నారు. ఈ కటౌట్‌ను అత్యాధునిక రూపకల్పనతో సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

మహానాడు వేడుకలకు ముందు ఈ కార్యక్రమం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం జరుగుతోందని నిర్వాహకులు పేర్కొన్నారు. లోకేష్ నాయకత్వానికి మద్దతుగా, యువతకు ప్రేరణ కలిగించేలా ఈ భారీ కటౌట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Leave a Reply