పెదవోగిరాల వద్ద రోడ్డు ప్రమాదం
పెదవోగిరాల వద్ద రోడ్డు ప్రమాదం
- లారీని ఢీకొట్టిన టిప్పర్
ఉయ్యూరు , ఆంధ్రప్రభ: విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై బుధవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. పెదవోగిరాల గ్రామ సమీపంలో వేగంగా వచ్చిన ఒక టిప్పర్, లారీని బలంగా ఢీకొట్టింది. టిప్పర్ ఢీకొన్న వేగానికి లారీ రోడ్డుపైనే అదుపుతప్పి పల్టీ కొట్టింది.
ప్రమాద సమయంలో రహదారిపై ఇతర వాహనాలు గానీ, పాదచారులు గానీ ఎవరూ లేకపోవడంతో ఒక పెద్ద ప్రాణాపాయం తప్పినట్లయింది.ఈ ఘటనలో రెండు వాహనాల డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న వెంటనే ఉయ్యూరు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పల్టీ కొట్టిన లారీ వల్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెదవోగిరాల వద్ద రోడ్డు ప్రమాదం

