రామ్మోహన్ నాయుడుతో ఎయిమ్స్ డైరక్టర్ భేటీ
రామ్మోహన్ నాయుడుతో ఎయిమ్స్ డైరక్టర్ భేటీ
ఉద్దానం కిడ్నీ సమస్యపై భేటీలో ప్రముఖంగా చర్చ.
ప్రస్తుత స్థితిని తెలిపిన రామ్మోహన్ నాయుడు.
త్వరలోనే క్షేత్ర స్థాయి పర్యటన జరపాలని సూచన.
శ్రీకాకుళం,ఆంధ్రప్రభ : ఎయిమ్స్ డైరక్టర్, నీతి ఆయోగ్ సభ్యులు ఎం.శ్రీనివాస్ మంగళవారం నాడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. ఇద్దరి మధ్య శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్య సమస్యలు, పరిష్కార మార్గాల గురించి చర్చ నడిచింది. ప్రధానంగా ఉద్దానం కిడ్నీ సమస్య.. సమస్యపై అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాలు, నూతన పరిష్కారాలపై విస్తృతంగా చర్చించారు.
కూటమి సర్కారు అందిస్తున్న తోడ్పాటు, పలాస కిడ్నీ ఆసుపత్రిలో ఇటీవల ప్రారంభించిన అధునాతన సేవలను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలియపరిచారు. ప్రజారోగ్య సంరక్షణ కోసం కలసి పనిచేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. త్వరలోనే క్షేత్ర స్థాయిలో పర్యటన జరపాలని, మరిన్ని సూచనలు చెయ్యాలని ఎయిమ్స్ డైరక్టర్ శ్రీనివాస్ ను కేంద్ర మంత్రి కోరారు.
