22 మంది లబ్ధిదారులకు

22 మంది లబ్ధిదారులకు

  • మంత్రి అచ్చెనాయుడు అందజేత


(కోటబొమ్మాళి, ఆంధ్రప్రభ) : శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (atchannaidu) క్యాంప్ కార్యాలయంలో మంగళవారం 22 మందికి వైద్యఖర్చుల నిమ్మిత్తం సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ చెక్కులను మంత్రి అచ్చెన్నాయుడు అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నారని తెలిపారు. సీఎం సహాయనిధి ద్వారా సకాలంలో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.400 కోట్ల చెక్కులను పేదలకు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. టెక్కలి నియోజకవర్గంలో 125మంది లబ్ధిదారులకు 2 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందచేశామని మంత్రి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామనే హామీని అమలు చేస్తున్నామని అయన తెలిపారు. నియోజకవర్గంలో పేదలకు ఇళ్ల పట్టాలు లబ్దిదారులకు మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. 2029 నాటికి ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను నిజం చేస్తాం మంత్రి అన్నారు.

Leave a Reply