ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

బాధ్యతలు చేపట్టిన నూతన జాయింట్ కలెక్టర్..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా ప్రజలకు రెవెన్యూ సమస్యలపై పారదర్శకంగా సమర్సవంతమైన పరిపాలన ప్రజలకు అధికారులు అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ పేర్కొన్నరు. మంగళవారం బదిలీపై వచ్చిన సూరజ్ ధనుంజయ్ కలెక్టరేట్‌లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించరు. సర్వమత సమ్మేళనంగా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా అధికారుల సమక్షంలో బాధ్యతలు చేపట్టిన ఆయనకు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కార విధానం, శాఖల వారీ పరిపాలనా తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నరు.ప్రజలకు పారదర్శక, సమర్థవంతమైన పరిపాలన అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు జాయింట్ కలెక్టర్ సూచించారు.

Leave a Reply