Khammam | పలువురికి గాయాలు..

Khammam | పలువురికి గాయాలు..

Khammam | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఖమ్మం జిల్లాలో పదో తరగతి పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థుల బస్సును లారీ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం గ్రామీణ మండలం సత్యనారాయణపురంలో ఈ ప్రమాదం జరిగింది. అరెంపుల మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాసి బస్సులో తిరిగి వెళ్తుండగా లారీ బస్సును ఢీకొట్టింది.

ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30మంది విద్యార్థులున్నారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడగా, ఒక ఉపాధ్యాయురాలు కూడా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply