సంక్షేమ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యం

  • ఇంటింటికీ టీడీపీతో ప్రజల్లోకి ఎమ్మెల్యే కొలికపూడి
  • నెమలి గ్రామంలో ప్రజలను కలిసి సమస్యలపై ఆరా
  • కూటమి రెండేళ్ల పాలన.. సంక్షేమం, అభివృద్ధిపై అవగాహన
  • మై టీడీపీ యాప్‌లో ప్రతి ఇంటి వివరాలు నమోదు చేయాలని సూచన
  • ప్రజా సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకుంటామని హామీ

గంపలగూడెం , ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న “ఇంటింటికి తెలుగుదేశం పార్టీ” కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలోని బీసీ ఏరియాలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు, అవసరాలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతులు, వ్యవసాయం, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు, పేద కుటుంబాల కోసం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సూపర్ సిక్స్ హామీల అమలు, అర్హులైన లబ్ధిదారులకు అందుతున్న ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. తిరువూరు నియోజకవర్గంలో చేపట్టిన సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యాలు, విద్య, వైద్య రంగాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలను వివరించిన ఎమ్మెల్యే, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రతి ఇంటి సందర్శన వివరాలను మైటీడీపీ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని, ప్రజల స్పందనను కచ్చితంగా నమోదు చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, యువత, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.