పేదలకు సత్వరమే సీఎంఆర్ఎఫ్…

పేదలకు సత్వరమే సీఎంఆర్ఎఫ్…
- మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
- సీఎంఆర్ఎఫ్ నుంచి 109 మందికి రూ.1.09 కోట్లు మంజూరు
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన ఆర్థిక సాయాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మంగళవారం చెక్కులు, ఎల్ఓసీల రూపంలో లబ్ధిదారులకు అందజేశారు. మైలవరం నియోజకవర్గ పరిధిలోని 83 మందికి రూ.53.19 లక్షల రీఎంబర్స్ మెంట్ చెక్కులు, 25 మందికి రూ.56.01 లక్షలు ఎల్ఓసీల రూపంలో ఆర్థికసాయం తాజాగా మంజూరైంది. మొత్తం 109 మందికి రూ.1.09 కోట్లు మంజూరయ్యాయి.
కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో (ఎల్ఓసీ)లను, చెక్కులను సీఎం చంద్రబాబు సందేశ పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నుంచి సత్వరం ఆర్థిక సాయం అందుతుందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నాయకులు పాల్గొన్నారు.

