మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే
చిట్యాల, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గురువారం పరామర్శించారు.
మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు చిలుముల రమణాచారి తండ్రి చిలుముల శేఖరయ్య, అలాగే కాంగ్రెస్ నాయకుడు, చిట్యాల మాజీ ఇన్‌చార్జి సర్పంచ్ ఆకుల రవీందర్ తండ్రి ఆకుల మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వారి నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబాలకు ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, ఈ క్లిష్ట సమయంలో తాము అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు గంగాధరి రవీందర్, దొడ్డి కిష్టయ్య, చిలకల రాయ కొమురు, బుర్ర శ్రీనివాస్, అల్లకొండ కుమార్, దబ్బేట అనిల్, గుర్రపు తిరుపతి, అల్లంరాజు, ఆకుల ఆది రెడ్డి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
