January 2027 | భార‌త్‌లో వ‌ర్షాభావ ప‌రిస్థితుల‌పై ప్ర‌భావం

January 2027 | భార‌త్‌లో వ‌ర్షాభావ ప‌రిస్థితుల‌పై ప్ర‌భావం

రుతుప‌వ‌నాల‌ను అడ్డుకునే ప్ర‌మాదం
వేడి గాలుల‌తో గ‌ణ‌నీయంగా త‌గ్గ‌నున్న వ‌ర్ష‌పాతం
వ్య‌వ‌సాయ‌రంగానికి ఏడాది పాటు క‌ష్టాలే
మేతో పాటు జూన్‌లోనూ త‌ప్ప‌ని వేసవి తాపం
జనవరి 2027 వరకు ఇదే పరిస్థితి..
తేల్చి చెప్పిన శాస్త్రవేత్తలు

January 2027 | న్యూ ఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : భారత వాతావరణ ముఖచిత్రం మారబోతోంది. తూర్పు, మధ్య పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలలో వస్తున్న మార్పుల నేపథ్యంలో ఎల్‌నినో అధికారికంగా ప్రారంభమైందని హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ప్రకటించింది. ఏప్రిల్ వరకు తటస్థంగా ఉన్న సముద్ర పరిస్థితులు ప్రస్తుతం ఎల్‌నినోగా మారాయని వెల్లడించింది. ప్రస్తుత మే నెల నుంచి మొదలైన ఈ ఎల్‌నినో పరిస్థితులు 2027 జనవరి వరకు కొనసాగుతాయని ఇన్‌కాయిస్ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఈ పరిణామాలు భారత వేసవి రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, దీనివల్ల వర్షపాతం గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

January 2027 |
January 2027 |

January 2027 | మత్స్య సంపదపై కూడా

ఇన్‌కాయిస్ శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన బేయేసియన్ కన్వల్యూషనల్ న్యూరల్ నెట్‌వర్క్ అనే డీప్ లెర్నింగ్ మోడల్ ద్వారా ఈ అంచనాలను రూపొందించారు. ఈ అధునాతన సాంకేతికత ద్వారా భవిష్యత్తులో వచ్చే ఎల్‌నినో లేదా లా నినా పరిస్థితులను 24 నెలల ముందే పసిగట్టవచ్చని సంస్థ తెలిపింది.ఎల్‌నినో ప్రభావంతో ఉత్తర హిందూ మహాసముద్రంలో బలమైన , సుదీర్ఘమైన సముద్రపు వేడిగాలులు ఏర్పడుతున్నాయని ఇన్‌కాయిస్ స్పష్టం చేసింది. ఇవి సముద్ర పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, మత్స్య సంపదపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

January 2027 | ఎల్ నినో తో..

భారత్‌లో ప్రస్తుతం ఎండల తీవ్రత పెరగడానికి, వర్షపాతం తగ్గడానికి ప్రధాన కారణం ఎల్‌నినో ప్రభావమేనని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల ఈ ఎల్‌నినో ఏర్పడుతుందట. ఎల్‌నినో వల్ల ఆకాశం నిర్మలంగా ఉండటం, మేఘాల ఆచ్ఛాదన తగ్గడం వల్ల సూర్యరశ్మి నేరుగా భూమిని చేరుతుంది. దీని ఫలితంగా మే నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఎల్‌నినో వల్ల పసిఫిక్ నుంచి భారత్ వైపు వీచే రుతుపవన గాలులు బలహీనపడతాయి. దీనివల్ల నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడమే కాకుండా, వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్‌నినో బలంగా ఉన్న ఏళ్లలో దేశంలోని మధ్య, వాయువ్య ప్రాంతాల్లో కరువు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

January 2027 | గత గణాంకాలను పరిశీలిస్తే..

1950 నుంచి సుమారు 7 ఏళ్లు భారత్‌లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు తగ్గడం వల్ల పంట దిగుబడులు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే భూగర్భ జలాలు అడుగంటిపోవడం, రిజర్వాయర్లలో నీటి మట్టం తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ ఏడాదిలో తరముకొస్తున్న ఎల్‌నినో చక్రం అత్యంత శక్తివంతమైన సూపర్ ఎల్‌నినోగా మారవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీని ఫలితంగా ఈ ఏడాది రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉందని కొన్ని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అలర్ట్ జారీ చేస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీలు పెరిగినా అది వర్షాలపై ప్రభావం చూపుతుంది. దీన్నే ఎల్‌నినో కండిషన్ అని పిలుస్తారు. ఉష్ణోగ్రతలు సాధారణంగా 2 డిగ్రీల కంటే ఎక్కువగా పెరిగితే సూపర్ ఎల్‌నినో ఏర్పడినట్టు చెబుతారు. జూలైలో భారత్‌లో ఎల్‌నినో ఏర్పడి.. వర్షాకాలంపై తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది వర్షపాతం గత ఏడాదితో పోల్చితే 92 శాతం మాత్రమేనేనట. గత ఏడాది 110శాతం వర్షపాతం నమోదైయ్యింది.

January 2027 | వేస‌వి తాపం పెరిగిపోతుంది..

భారత్‌లో సర్వసాధరణంగా ఎండాకాలంలో బయటికి వెళ్లాలంటే భయం. ప్రస్తుతం వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయింది. ఎండల తీవ్రత 40 నుంచి 45 డిగ్రీలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం వేళ ఎండల తీవ్రత, సాయంత్రం వేడిగాల్పులకు తోడు పొల్యూషన్. బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. ఎండవేడికి వడదెబ్బతో అల్లాడుతున్నారు. నడినెత్తిన ఎండ, రోడ్డుపై నుంచి వస్తున్న సెగతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్‌లో ఆగినప్పుడు మరింత నరకం చూస్తున్నారు. పాదచారులదీ ఇదే దుస్థితి. ఇళ్లకే పరిమితమైనా.. గాలి ఆడక ఉక్కపోతకు మలమల మాడిపోతున్నారు. ఉక్కపోత ఎక్కువైంది. దీనికితోడు విద్యుత్ కష్టాలు లేకపోలేదు. ఏమాత్రం కాస్త కరెంటు పోయినా ఇంట్లో కూడా ఉండలేని ప‌రిస్థితి.

ఎండటైములో ట్యాప్‌ నీళ్లు ఆన్ చేస్తే సలసల కాగుతున్న వేడివేడి నీళ్లు వస్తున్నాయి. ఆ ప్రభావం ఉదయం ఆరు వరకు కూడా ఉంటుందంటే ఎండల తీవ్రత ఎంతగా ఉందో అంచనా వేయవచ్చు. ఈ పరిస్థితి మరో నెల పాటు కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మే, జూన్ నెలల్లో సూర్యుని తీవ్రత మరింత పెరుగుతుందట. అంటే ఈ ఏడాది ఎండాకాలం సుదీర్ఘంగా కొనసాగుతుందన్న మాట. వాతావరణ మార్పుల కారణంగా వర్షం లేకుండా ఈ వేడి నుంచి తప్పించుకోవడం అసాధ్యమని చెబుతున్నారు. ఏపీలోని 215 మండలాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తెలంగాణలో అయితే ఏకంగా 45 డిగ్రీలకు అటూఇటూగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఇవి సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువ.

CLICK HERE TO READ MORE : Operation Sindoor-2 | భారత్ ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది పాక్‌కు వార్నింగ్‌

CLICK HERE TO READ MORE

Leave a Reply