Jagtial | వ‌రంగ‌ల్ జిల్లాలో నిర్వ‌హ‌ణ‌కు ప్లాన్

Jagtial | వ‌రంగ‌ల్ జిల్లాలో నిర్వ‌హ‌ణ‌కు ప్లాన్

Jagtial | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వరుస సభలు, నిరసనలు, రాజకీయ కార్యకలాపాలతో తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తోంది. నేడు జగిత్యాలలో భారీ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. దీనిని “జైత్రయాత్ర”గా అభివర్ణిస్తూ, పార్టీ పూర్వ వైభవం కోసం ఈ సభను ఒక పండుగలా నిర్వహిస్తున్నారు. ఈ జగిత్యాల సభ వేదికగా కీలక నేత జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు, ఇది పార్టీకి మరింత బలాన్నిస్తుందని భావిస్తున్నారు. అలాగే వ‌రంగ‌ల్ జిల్లాలో మ‌రో బ‌హిరంగ స‌భ నిర్వ‌హించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. రైతు స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు గులాబీ ద‌ళం సిద్ధ‌మ‌వుతోంది. 10వేల మంది రైతుల‌తో మే మొద‌టి వారంలో స‌భ నిర్వ‌హ‌ణ‌కు ప్లాన్ చేస్తున్న‌ట్లు పేర్కొన్నాయి. ఇలా వ‌రుస స‌భ‌ల నిర్వ‌హ‌ణ ద్వారా బీఆర్‌ఎస్‌కు పూర్వ వైభవం తెస్తాయని, తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపుగా మారతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Leave a Reply