అమరావతి దార్శనికుడు సీఎం చంద్రబాబు…

అమరావతి దార్శనికుడు సీఎం చంద్రబాబు…
64వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు రవికుమార్..
పాయకాపురం, ఆంధ్రప్రభ : రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధిలో దార్శనికుడు సీఎం చంద్రబాబు అని స్థానిక64వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్ అన్నారు. సెంట్రల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వర రావు ఆదేశాల మేరకు 64 వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా డివిజన్ అధ్యక్షులు కే రవికుమార్ గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ టిడిపి అధ్యక్షుడు కె. రవికుమార్ శ్రేణులు సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు, స్థానికులు,పాల్గొన్నారు
