రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ఇప్పటికే ఎలిమినేట్ అయిన రాజస్థాన్ ఈ మ్యాచ్ లో పంజాబ్ కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. విజయతీరాలకు చేరలేపోయింది. ఇక రాజస్థాన్ పై 10 పరుగుల తేడాతో విజయం సాధించిన పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాకి దూసుకెళ్లింది.
ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. దీంతో 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన రాజస్థాన్… చివరి ఓవర్ వరకు పోరాడి 209 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (50), వైభవ్ సూర్యవంశీ (40) అదిరే ఆరంభం ఇచ్చారు. దృవ్ జురేల్ (53) కూడా తన వంతు పోరాటం చేశాడు. అయితే, మిగితా బ్యాటర్లు కెప్టెన్ సంజూ (20), రియాన్ పరాగ్ (13), హెట్మేయర్ (11) నిరాశ పరిచారు.
పంజాబ్ బౌలర్లలో మార్కో జాన్సన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండేసి వికెట్లు తీయగా.. హర్‌ప్రీత్ బ్రార్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు.
మొదట బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ కు 220 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో నేహల్ వధేరా 70, శశాంక్ సింగ్ 59 పరుగులతో రాణించారు.
అలాగే శ్రేయస్ అయ్యర్ 30, ప్రభుసిమ్రన్ సింగ్ 21, అజ్మతుల్లా ఒమర్జాయ్ 21 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ప్రియాంశ్ ఆర్య 9, మిచెల్ ఓవెన్ 0 విఫలమయ్యారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తుశార్ దేశ్పాండే 2, క్వెనా మపాకా, రియాన్ పరాగ్, ఆకాశ్ మద్వాల్ తలో వికెట్ తీసుకున్నారు.