యూరియా కోసం ధర్నా

వరంగల్ : వ‌రంగ‌ల్ జిల్లా రాయ‌ప‌ర్తి మండ‌ల కేంద్రంలో యూరియా కొర‌త‌కు నిర‌స‌న‌గా రైతులు ధ‌ర్నా (Farmers protest) కు దిగారు. ఆందోళ‌న‌కు దిగిన అన్న‌దాత‌ల‌కు మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించారు. ధ‌ర్నాలో ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు (Errabelli Dayakar Rao) కూడా పాల్గొన్నారు.

రైతులకు మద్దతు (farmers Support) గా ధర్నాలో కూర్చున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్ర‌మంలో అక్క‌డ తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. పోలీసుల‌కు, రైతుల‌కు మ‌ధ్య తోపులాట జ‌రిగింది. అరెస్టు (arrest) చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు ను రాయపర్తి పోలీస్ స్టేషన్ (Rayaparthi Police Station) కు తరలించారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అన్న‌దాత‌లు నినాదాలు చేశారు.

Leave a Reply