Industry | భారీ మంటలు.. పలువురు మృతి

Industry | భారీ మంటలు.. పలువురు మృతి

Industry | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పరిశ్రమలో పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.

పేలుడు జరిగిన బాణసంచా పరిశ్రమను సరైన అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు.

ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించినట్లు సమాచారం.