indrakeeladri14thjune | ఇంద్రకీలాద్రిపై పెరుగుతున్న భక్తుల రద్దీ

indrakeeladri14thjune | ఇంద్రకీలాద్రిపై పెరుగుతున్న భక్తుల రద్దీ

indrakeeladri14thjune | కనకదుర్గమ్మ దర్శనానికి పోటెత్తుతున్న భక్తజనం..
శనివారం 57,239 మంది అమ్మవారిని దర్శించుకున్న భక్తులు
హుండీ ఆదాయం రూ.7.90 లక్షలు..
9 వేల మందికి అన్నదానం

indrakeeladri14thjune | ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వేసవి సెలవులు ముగిసినప్పటికీ వారాంతపు సెలవుల నేపథ్యంలో ఆలయంలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. అమ్మవారికి నిర్వహిస్తున్న వివిధ ఆర్జిత సేవల్లో భక్తులు ప్రత్యక్షంగా, పరోక్షంగా విశేషంగా పాల్గొంటున్నారు. దర్శనాల కోసం ప్రత్యేక క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడగా, ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ సౌకర్యాలు కల్పిస్తున్నారు.

indrakeeladri14thjune

శనివారం ఆలయ వివరాలు ఇలా..

దేవస్థానం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ 13 శనివారం మొత్తం 11,439 దర్శన టికెట్లు విక్రయించగా, 57,239 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రసాదాల విక్రయాలు కూడా భారీగా నమోదయ్యాయి. మొత్తం 93,759 యూనిట్ల ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేశారు. అమ్మవారి హుండీ ద్వారా ఒక్కరోజే రూ.7,90,890 ఆదాయం లభించింది. వివిధ ఆర్జిత సేవల్లో 628 మంది భక్తులు పాల్గొనగా, 2,554 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే దేవస్థానం నిర్వహించిన నిత్య అన్నదాన కార్యక్రమంలో 9,000 మంది భక్తులు ప్రసాద భోజనం స్వీకరించారు. భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో తాగునీరు, క్యూలైన్ల నిర్వహణ, ప్రసాదాల పంపిణీ, అన్నదానం వంటి ఏర్పాట్లను దేవస్థానం అధికారులు మరింత విస్తృతంగా చేపట్టారు. భక్తులు ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

indrakeeladri14thjune
indrakeeladri14thjune

CLICK HERE TO READ indrakeeladri13thjune | ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం..

CLICK HERE TO READ MORE

Leave a Reply