కనకదుర్గమ్మను దర్శించుకున్న సంగీత దర్శకుడు కోటి
కనకదుర్గమ్మను దర్శించుకున్న సంగీత దర్శకుడు కోటి
ఆంధ్రప్రభ, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఆదివారం దర్శించుకున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన స్వరాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన కోటి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేసి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు వేదాశీર્వచనం అందించగా, దేవస్థానం తరఫున అమ్మవారి ప్రసాదం అందజేశారు.
తెలుగు సినీ సంగీత రంగంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతం అందించిన కోటి, అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ విశిష్టతను కొనియాడినట్లు భక్తులు తెలిపారు. ఆయన రాకతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది.
