Prabhas | సంక్రాంతి బరిలోకి యంగ్ రెబల్ స్టార్..?

Prabhas | సంక్రాంతి బరిలోకి యంగ్ రెబల్ స్టార్..?

Prabhas | ఫౌజీపై క్రేజ్ పెరుగుతోంది – రిలీజ్‌పై సస్పెన్స్
స్పిరిట్ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చేసిందా?
కల్కి 2తో మరోసారి రికార్డుల వేటకు ప్రభాస్ సిద్ధమా?

Prabhas | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఒకటి కాదు రెండు కాదు.. ముచ్చటగా మూడు సినిమాలను ఓకేసారి చేస్తుండడం విశేషం. ఆ మూడు సినిమాలు ఏంటంటే.. ఫౌజీ, స్పిరిట్, కల్కి 2. ఈ మూడు సినిమాల షూటింగ్స్ తో ప్రభాస్ ఏమాత్రం గ్యాప్ లేకుండా ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే.. గత కొంతకాలంగా ఫౌజీ షూటింగ్ జరుపుకుంటూనే ఉంది కానీ.. రిలీజ్ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ లీకైంది. ఇంతకీ.. ఫౌజీ వచ్చేది ఎప్పుడు..? మిగిలిని స్పిరిట్, కల్కి 2 సినిమాల పరిస్థితి ఏంటి..?

Prabhas | ఫౌజీ ప్లాన్ ఇదే..

ప్రభాస్ ను ఇంతకు ముందు ఎవరూ చూపించని విధంగా సరికొత్తగా చూపించబోతున్నాడు హను రాఘవపూడి. ఇందులో బ్రిటీష్ సైనికుడుగా పవర్ ఫుల్ రోల్ కనిపిస్తాడని ప్రచారం అయితే జరుగుతుంది కానీ.. సరైన గెటప్ మాత్రం రిలీజ్ చేయలేదు. అయితే.. ఈ సినిమాని ముందుగా ఆగష్టులో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. షూటింగ్ అనుకున్న ప్లాన్ ప్రకారం జరగకపోవడంతో పోస్ట్ పోన్ అయ్యింది. ఆతర్వాత డిసెంబర్లో ఫౌజీ రిలీజ్ అంటూ ప్రచారం జరిగింది. డిసెంబర్లో కూడా ఫౌజీ రావడం లేదని.. సంక్రాంతి బరిలో ఫౌజీని దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్.

Prabhas

Prabhas | స్పిరిట్ రావడం ఖాయం..

ఇక ప్రభాస్ ఫౌజీతో పాటు స్పిరిట్, కల్కి 2 సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. స్పిరిట్ కోసం డేట్స్ ఎక్కువుగానే కేటాయిస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ మూవీని నెక్ట్స్ ఇయర్లో మార్చి 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ డేట్ కి స్పిరిట్ రాదని ప్రచారం జరిగింది కానీ.. సందీప్ రెడ్డి వంగ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 5న స్పిరిట్ సినిమాని విడుదల చేయాల్సిందే అని పట్టుదలతో వర్క్ చేస్తున్నారు. ప్రచారంలో ఉన్న వార్తలను ఖండించి.. స్పిరిట్ 2027 మార్చి 5న రావడం ఖాయమని మరోసారి కన్ ఫర్మ్ చేశారు.

Prabhas

Prabhas | కల్కి 2 రిలీజ్ ఎప్పుడు..?

కల్కి 2 విషయానికి వస్తే.. ఇటీవల ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2 మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది. అమితాబ్, కమల్ హాసన్ పై కీలక సన్నివేశాలను ఇటీవల చిత్రీకరించారు. ప్రభాస్ కూడా ఈ మూవీ షూట్ లో జాయిన్ అయ్యారు. కల్కి ఫస్ట్ పార్ట్ 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేయడంతో.. కల్కి సెకండ్ పార్ట్ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి.. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అంటే.. 2027 డిసెంబర్లో విడుదల అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ, స్పిరిట్, కల్కి 2.. ఈ మూడు సినిమాల పై భారీగా అంచనాలు ఉన్నాయి. మరి.. బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో చూడాలి.

Prabhas

CLICK HERE TO READ Prabhas-Mahesh Suspense | ప్రభాస్, మహేష్‌.. సస్పెన్స్ కి తెర దించేది ఎప్పుడు..?

CLICK HERE TO READ MORE

Leave a Reply