తేజాపూర్‌లో నూతన ఇందిరమ్మ గృహాల ప్రారంభం

తేజాపూర్‌లో నూతన ఇందిరమ్మ గృహాల ప్రారంభం

నేరడిగొండ, ఆంధ్రప్రభ: నేరడిగొండ మండలంలోని తేజాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహాల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ సింగరి వసుంధర నవీన్, ఎంపీడీవో రమేష్ ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి నూతన గృహాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ సింగరి వసుంధర నవీన్ మాట్లాడుతూ.. గ్రామంలోని పలు సమస్యలను ఎంపీడీవో రమేష్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామానికి మరిన్ని ఇందిరమ్మ గృహాలను కేటాయించాలని కోరారు.ఎంపీడీవో రమేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను అర్హులు తప్పకుండా వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవి, పంచాయతీ కార్యదర్శి సునీల్‌కుమార్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.