మరో నాలుగు రోజుల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి

  • మున్సిపల్ చైర్‌పర్సన్ పెద్దింటి పద్మ

చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూర్ మున్సిపల్ పరిధిలో నిర్వహిస్తున్న ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను మరో నాలుగు రోజుల్లో వంద శాతం పూర్తి చేయనున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ పెద్దింటి పద్మ తెలిపారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను వేగవంతంగా చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని 3, 12వ వార్డుల్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలను చైర్‌పర్సన్ పెద్దింటి పద్మ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

మంత్రి ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను నింపే ప్రక్రియలో సహకరిస్తున్నారని తెలిపారు. మరో నాలుగు రోజుల్లో మున్సిపాలిటీ పరిధిలో ఎస్ఐఆర్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు పెద్దింటి పద్మ పేర్కొన్నారు.