ఎమ్మెల్యే వసంతను కలిసిన జి.కొండూరు తహసీల్దార్

ఎమ్మెల్యే వసంతను కలిసిన జి.కొండూరు తహసీల్దార్

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ: జి.కొండూరు తహసీల్దార్‌గా నియమితులైన రిబ్కా రాణి శుక్రవారం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ రిబ్కా రాణి మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు, లబ్ధిదారులకు సమర్థంగా చేరేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన రిబ్కా రాణికి శుభాకాంక్షలు తెలిపారు.