అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
కడెం, ఆంధ్రప్రభ : అర్హులైన నిరుపేదలకు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇళ్లను మంజూరు చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు.
గురువారం కడెం మండలం ఉడుంపూర్ గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెంకాయ కొట్టి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదల సొంతింటి కల నెరవేరుతుందని అన్నారు. ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో లబ్ధిదారులు ఎమ్మెల్యేకు శాలువాతో సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉడుంపూర్ గ్రామ సర్పంచ్, సర్పంచుల ఫోరం కడెం మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్ గుప్తా, స్థానిక నాయకుడు కాశవేణి లింగన్న యాదవ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
