Incident | 15 మంది భక్తులకు గాయాలు

Incident | 15 మంది భక్తులకు గాయాలు

Incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా కొండగట్టులో అపశృతి చోటుచేసుకుంది. భారీగా ఏర్పాటు చేసిన పందిరి కూలిపోవడంతో భక్తులు గాయపడిన ఘటన కలకలం రేపింది.

హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులతో కిక్కిరిసిన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో అనుకోని ఘటన చోటుచేసుకుంది. కేశఖండనం వద్ద ఏర్పాటు చేసిన భారీ చలువ పందిరి అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు 15 మంది భక్తులు గాయపడగా, వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

పండుగ సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చిన సమయంలో ఈ ప్రమాదం జరగడం ఆందోళన కలిగించింది. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, నాసిరకం నిర్మాణ పనులే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఘటనపై విచారణ చేపట్టారు.