BJP | భారీగా చేరికలు
BJP |భారీగా చేరికలు
Bjp | రాబోయే స్థానిక ఎన్నికల్లో బిజెపిని ఆదరించాలి
బిజెపి లో చేరిన వారికి కండువాలు వేసిన జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్
BJP | ఉట్నూర్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాలకు జిల్లాలకు అనేక నిధులు మంజూరు చేస్తున్నారని ప్రజలు రాబోయే స్థానిక ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులకు ఆదరించాలని బిజెపి పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ అన్నారు. ఈరోజు ఆయన నివాసంలో బిజెపి పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరగా వారికి ఆయన పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.
Bjp | వార్డ్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలి

Bjp | బిజెపిలో చేరిన వారిలో కుమారి బానోవత్ సంగీత, చౌహాన్ శాంత, సీనాభాయి,ఆడే మోబిలాల్, పవర్ అశోక్, జాదవ్ రాజు నాయక్, జాదవ్ దేవ్ సింగ్, తో పాటు పలువురు చేరారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రితేష్ రాథోడ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రం ఇస్తున్న నిధుల నుండే రాష్ట్రంలో అభివృద్ధి పనులు నడుస్తున్నాయని ప్రజలంతా గమనించి బిజెపి పార్టీకి బలపరిచిన సర్పంచ్, వార్డ్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఉట్నూరు మండల అధ్యక్షులు బింగి వెంకటేష్,జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ టేకం హరిప్రసాద్, ఎస్టి మోర్చా జిల్లా కార్యదర్శి రాథోడ్ శేషారావు,సీపతి లింగాగౌడ్, బొడ్డు కిరణ్, కాల్వ రవి, ఉగ్గే విజయ్, చింతల రమణ, బి జితేందర్. బూత్ అధ్యక్షులు జాదవ్ సతీష్, పులి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
