సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తా..

సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తా..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. చౌటుప్పల్ పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో చైర్పర్సన్ పావని రమేష్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు బత్తుల వాణి విప్లవ్ గౌడ్, ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్, కొయ్యడ శేఖర్ గౌడ్, బత్తుల జయమ్మ దాసు గౌడ్, మార్కెట్ డైరెక్టర్ పబ్బు శ్రీకాంత్ గౌడ్ లను ఘనంగా సన్మానించారు.

అదేవిధంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు 466 మార్కులు సాధించిన లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన తొర్పునూరు శ్రీనివాస్ గౌడ్ – కవిత దంపతుల కూతురు నేహాశ్రీని అభినందిస్తూ రూ. 10,116 లు నగదు ప్రోత్సాహకాన్ని అందించి సన్మానించారు. ఈ కార్యక్రమాలలో గౌడ సంఘం అధ్యక్షుడు చింతకింది అంజయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి తొర్పునూరు వెంకటేశం గౌడ్, గౌరవ అధ్యక్షుడు బత్తుల లక్ష్మయ్య గౌడ్, ఊడుగు శ్రీనివాస్ గౌడ్, చెవగోని వెంకటేశం గౌడ్, బత్తుల శ్రీశైలం గౌడ్, ఊడుగు మల్లేశం గౌడ్, ఎంఎస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply