ఉచిత హాకీ శిక్షణ శిబిరానికి శ్రీకారం..

చిట్యాల, ఆంధ్రప్రభ : క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతో పాటు విద్యలో కూడా విద్యార్థులు చురుకుగా రాణించేందుకు దోహదపడతాయని ఉరుమడ్ల గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ బిక్షం తెలిపారు.

నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని ఉరుమడ్ల గ్రామంలో శుక్రవారం నల్గొండ జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో వేసవి ఉచిత హాకీ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరం శిక్షకుడు గంగాపురం రాము పర్యవేక్షణలో నిర్వహించబడుతోంది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ సాగర్ల భానుశ్రీ బిక్షం, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ వాడపల్లి రవీందర్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్రీడలు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని, నియమితంగా ఆటలు ఆడడం వల్ల శరీరంలో క్యాలరీలు వినియోగమై అనారోగ్య సమస్యలు దూరమవుతాయని తెలిపారు. క్రీడల వల్ల ఒత్తిడి తగ్గి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని, లక్ష్యసాధనలో పట్టుదల పెంపొందుతుందని పేర్కొన్నారు.

అనంతరం క్రీడాకారులకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పొలగోని స్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పల్లపు బుద్ధుడు, గ్రామ సెక్రటరీ ఉపేందర్, సోషల్ మీడియా ఇంచార్జ్ పట్ల జనార్ధన్, వార్డు సభ్యులు జనపాల శ్రీను, మందుగుల పార్వతమ్మ, మెడబోయిన స్వాతి శ్రీనివాస్, కురుపాటి లింగయ్య, మర్రి రమేష్, బోయ స్వామి, ఉయ్యాల మల్లేష్, జాంగిర్, వ్యాయామ ఉపాధ్యాయులు కొండా పరమేష్, ఎలుగు చంద్రశేఖర్, సాగర్ల లింగస్వామి, సీనియర్ క్రీడాకారులు రాచమల్ల శ్రీను, హరి ప్రసాద్, బొడ్డు శ్రీను, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply