టీపీసీసీ నాయకుడు యుగంధర్ జన్మదిన వేడుకలు..

టీపీసీసీ నాయకుడు యుగంధర్ జన్మదిన వేడుకలు..

  • ఎంపీ చామల ఆశీస్సులు తీసుకున్న యుగంధర్

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూరు మండలం సదర్శాపురం గ్రామానికి చెందిన టీపీసీసీ నాయకుడు, అడ్వకేట్ పర్రెపాటి యుగంధర్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి ఎంపీ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి యుగంధర్ కు శాలువా కప్పి సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వంగాల సత్యనారాయణ,మున్సిపల్ కౌన్సిలర్ బీసు శ్రీకాంత్ గౌడ్, నాయకులు బీసు రవి, శ్రవణ్,ఎం డి జానీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply