HYD | తప్పుడు ప్రచారం చేయొద్దు : అషురెడ్డి
HYD | తప్పుడు ప్రచారం చేయొద్దు : అషురెడ్డి
HYD | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : సినీ నటి అషు రెడ్డిపై హైదరాబాద్ సిటీ క్రైమ్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. లండన్‌లో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, గత ఏడేళ్లలో సుమారు రూ. 9.35 కోట్లు, 5 కిలోల బంగారం మరియు ఆస్తులను కాజేశారని బాధితుడి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై అషురెడ్డి స్పందించారు.
తన ప్రమేయం లేకుండా తన గురించి వార్తలు రాసినా, తప్పుడు ప్రచారం చేసినా లీగల్ యాక్షన్ తప్పదంటూ హెచ్చరించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఆపై ఆమె పలు ఫోటోలను షేర్ చేసింది. కొద్దిరోజుల క్రితం ఆమె కొల్హాపూర్ లక్ష్మీదేవి క్షేత్రం దర్శించుకున్న దృశ్యాలను పంచుకుంది. అయితే, అందులో అమ్మవారికి సమర్పించిందేకు కొబ్బరికాయ, పూలు, పసుపు, కుంకుమ, మెట్టెలు, తాళి వంటి వస్తువులు ఉండటం విశేషం.
