27న ప్రభుత్వ పురుషుల కళాశాలలో మెగా జాబ్ మేళా

27న ప్రభుత్వ పురుషుల కళాశాలలో మెగా జాబ్ మేళా
850 ఉద్యోగాల భర్తీకి అవకాశం
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పురుషుల కళాశాలలో 27వ తేదీ సోమవారం భారీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ వై. పోలినాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల జవహర్ నాలెడ్జ్ సెంటర్, ఉన్నతి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి హెటిరో, న్యూలాండ్, ఫాక్స్‌కాన్, షనైడర్, ఓరియంట్, టాటా, వోల్టాస్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి సుమారు 12 ప్రముఖ కంపెనీలు హాజరవుతున్నాయి.
ఈ కంపెనీల ద్వారా మొత్తం 850 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు ఇదొక గొప్ప అవకాశమని, అర్హత గల అభ్యర్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, డిగ్రీ, ఎంఎల్‌టీ అర్హత కలిగిన విద్యార్హతలు, అభ్యర్థులు 27వ తేదీ ఉదయం 9:30 గంటలకు కళాశాలలోని ఆర్ట్స్ భవనానికి నేరుగా హాజరు కావాలి.
అభ్యర్థులు తమ వెంట విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, నాలుగు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, బయోడేటా సెట్లను తీసుకురావాలని కళాశాల జేకేసీ కోఆర్డినేటర్ వై. మణికుమార్ సూచించారు. ఈ జాబ్ మేళాకు సంబంధించిన ఇతర పూర్తి వివరాల కోసం 9949094968, 9182063878 లేదా 8897941917 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.
