ఉమ్మడి బాల్కొండ మండలంలో పలువురు పోలీసుల బదిలీలు

బాల్కొండ, ఆంధ్రప్రభ ; నిజామాబాద్ జిల్లా ఉమ్మడి బాల్కొండ మండలంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు పోలీసులను శనివారం రాత్రి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బదిలీ చేశారు.బాల్కొండ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఠాకూర్ సింగ్ ను మెండోరా పోలీస్ స్టేషన్ కు, వాసుదేవును నందిపేట్ పోలీస్ స్టేషన్ కు, సుమతి నీ జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.

కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శీకారి పవన్, రోహిణి లను జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ కు, ప్రశాంత్ ను డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ కు, ఉదయ రేఖను ఆర్మూర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. వారి స్థానాలలో హెడ్ కానిస్టేబుళ్లు గా ఎన్ఐబి నిజామాబాద్ నుండి చంద్రశేఖర్, ఇందల్ వాయి నుండి ప్రకాష్, ఎడపల్లి నుండి రాజన్నలు రానున్నారు. కానిస్టేబుళ్లు గా ఎర్గట్ల పోలీస్ స్టేషన్ నుండి వాణి, భీంగల్ పోలీస్ స్టేషన్ నుండి సమత, ఆర్మూర్ పోలీస్ స్టేషన్ నుండి చిలువేరి శ్వేత, లోకిని సుకన్యాలు రానున్నారు.

ముప్కాల్…

ముప్కాల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైలు గా విధులు నిర్వహిస్తున్న తోగర్ల సురేష్ ను ఇందల్వాయి పోలీస్ స్టేషన్ కు.చిన్న గంగారం ను నిజామాబాద్ వన్ టౌన్ కు బదిలీ చేశారు. కమ్మర్పల్లిలో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న గంగారం ముప్కాల్ పోలీస్ స్టేషన్ ఎఎస్సైగా రానున్నారు. ముప్కాల్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న తారా సింగ్ ను రెంజల్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఉద్దవ్ ను జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఎడపల్లి పోలీస్ స్టేషన్ నుండి లక్ష్మణ్ హెడ్ కానిస్టేబుల్ గా ముప్కాల్ పోలీస్ స్టేషన్ కు రానున్నారు.

మెండోరా…

మెండోరా పోలీస్ స్టేషన్ లో ఏఎస్సై గా విధులు నిర్వహిస్తున్న గంగాధర్ ను నిజాంబాద్ త్రీ టౌన్ కు బదిలీ చేశారు.హెడ్ కానిస్టేబుళ్లు గా విధులు నిర్వహిస్తున్న నరేందర్ ను వేల్పూర్ కు, మోహన్ ను సిరికొండకు బదిలీ చేశారు.మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీజ ను భీంగల్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. నందిపేట్ లో మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రేణుకను మెండోరా పోలీస్ స్టేషన్ కు రానున్నారు.