తూర్పు నియోజకవర్గంలో హైబ్రీడ్ మహానాడు ఉత్సాహం
తూర్పు నియోజకవర్గంలో హైబ్రీడ్ మహానాడు ఉత్సాహం
పలు క్లస్టర్లలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్
విజయవాడ, పటమట, ఆంధ్రప్రభ : రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాలే తెలుగుదేశం పార్టీ విధానమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని 1వ క్లస్టర్ పరిధిలోని 2, 5 డివిజన్లలో హైబ్రీడ్ విధానంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, తూర్పు నియోజకవర్గ అబ్జర్వర్ మూల్పూరి సాయి కళ్యాణి కలిసి మహానాడు నిర్వహణ తీరును వీక్షించారు.
ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేశారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులను సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. రహదారుల పునర్నిర్మాణంతో పాటు సంక్షేమ పథకాలను లబ్ధిదారుల ఇంటివరకు చేరుస్తున్నట్లు తెలిపారు. గత వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అందుకే ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకున్నారని అన్నారు. సంక్షేమ పథకాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో దాసరి గాబ్రియేల్, బచ్చలకూర అజయకుమార్, దొమకొండ రవి, సొగసాని రత్నశ్రీ కృష్ణ ప్రసాద్, నందిపాటి దేవానంద్, దేవరపల్లి శ్రీహరి, వావిళ్లపల్లి సత్యనారాయణ, గొర్ల శివనాగేశ్వరరావు, చెరుకూరి మల్లిఖార్జునరావు, బండ్ల శివనాగేశ్వరరావు, రిమ్మనపూడి బ్రహ్మేశ్వరరావు, కోడూరు సుబ్రహ్మణ్యం, కట్టెవరపు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
అదే విధంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తూర్పు నియోజకవర్గంలోని మరికొన్ని క్లస్టర్లలో కూడా మహానాడు కార్యక్రమాలను సందర్శించారు. రాణిగారితోట, కృష్ణలంక, రామచంద్రనగర్, పడమట ప్రాంతాల్లో నిర్వహించిన హైబ్రీడ్ మహానాడు సమావేశాల్లో పాల్గొని కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
