తొర్రూరులో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలోని ఆంజనేయ స్వామికి ఆకు పూజతో పాటు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వికాస తరంగిణి ఆధ్వర్యంలో సుందరకాండ పారాయణం నిర్వహించారు.

ఈ సందర్భంగా భక్తులకు వడపప్పు, శీతలం, తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తొర్రూరు శాఖ చైర్మన్ కుందూరు గీతారెడ్డి, ప్రసూన, విజయలక్ష్మి, శోభ, రేణుక, గీతారాణి, సరస్వతి, ఇందిరా, పిఆర్వో ఇమ్మడి రాంబాబు, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply