అమరావతి ఆంధ్రప్రదేశ్‌దా?… తెలుగుదేశం పార్టీకా?
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్
నందిగామ, ఆంధ్రప్రభ : అమరావతి ఆంధ్ర ప్రదేశ్ కా లేక తెలుగుదేశం పార్టీ కానీ మాజీ ఎమ్మెల్యే మొండితో జగన్మోహన్రావు ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రపంచస్థాయి రాజధాని అని చెప్పుకుంటున్న అమరావతికి ప్రతిపక్ష నేతలు వస్తే టీడీపీకి ఎందుకు భయం, ఎందుకు దాడులు జరుగుతున్నాయి అని ఆయన ప్రశ్నించారు. రాజధానిలోకి ప్రతిపక్షాలు, సామాన్యులు ప్రవేశించలేని పరిస్థితి ఎందుకు ఏర్పడిందని నిలదీశారు.
రాజధాని ప్రాంతంలో రైతుల భూములపై ప్లాట్లు వేయడం, వ్యవసాయ భూములను పనికిరాకుండా చేయడం, గుంటలు తవ్వి నీరు వదలడం వంటి చర్యలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను కలవడానికి వెళ్లిన ప్రతిపక్ష కమిటీ సభ్యులపై దాడులు జరగడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. అమరావతి నిర్మాణంలో కేంద్ర సూచించిన రేట్ల కంటే మూడు–నాలుగు రెట్లు అధికంగా ఖర్చు చేసి అవినీతి, దోపిడీ జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ విషయాలు బయటపడతాయనే భయంతోనే ప్రతిపక్షాలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌పై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని ఉపయోగించుకుంటున్నారని, ప్రజలను నమ్మించి మోసం చేయడం వారి విధానమని అన్నారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులు పూర్తికాకపోవడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. 2019 ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఎందుకు ఓడించారో ఆ పార్టీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలుస్తుందని, ఎలాంటి దాడులకు భయపడదని ఆయన పేర్కొన్నారు.
