bharat taxi | 500 నగరాలకు విస్తరణ లక్ష్యం

bharat taxi | 500 నగరాలకు విస్తరణ లక్ష్యం

bharat taxi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్‌లో ‘భారత్ ట్యాక్సీ’ సేవలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన రవాణా సేవలు అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రైవేట్ క్యాబ్ సేవలపై అమిత్ షా విమర్శలు గుప్పించారు. భారత్ ట్యాక్సీ సేవలను అడ్డుకునేందుకు కొన్ని ప్రైవేట్ క్యాబ్ సంస్థలు అక్రమ పోటీ పద్ధతులను అనుసరిస్తున్నాయని ఆరోపించారు.

భారత్ ట్యాక్సీ సేవలను దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు ఆయన వెల్లడించారు. రాబోయే పదేళ్లలో 500 నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు.ప్రజలకు పారదర్శకమైన, నమ్మకమైన, తక్కువ ఖర్చుతో కూడిన రవాణా సేవలను అందించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని అమిత్ షా తెలిపారు.