అధికారులు జనగణన సర్వే సమర్థవంతంగా చేపట్టాలి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; రైతులు ఎంతో కష్టపడి పండించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తారని కొనుగోలు కేంద్రం వద్ద జాప్యం చేయకుండా కొనుగోలు చేయాలని నారాయణపేట జిల్లా గృహ నిర్మాణ శాఖ పిడి మండల ప్రత్యేక అధికారి శంకర్ నాయక్ సూచించారు.

మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పులిమామిడి లో వరికొనుగోలుకేంద్రం, జనగణన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పిడి శంకర్ మాట్లాడుతూ అకాల వర్షాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడవకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు.

ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న రైతులతో వివిధ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న జనగణన కార్యక్రమం అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి సమర్థవంతంగా సర్వే చేపట్టాలన్నారు. అధికారులు పారదర్శకంగా సర్వే చేపడితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంతో పాటు పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమపథకాలుఅందుతాయని అన్నారు.

ఎన్యుమానేటర్లు, సూపర్వైజర్లు జనగణన కార్యక్రమం బాధ్యతయుతంగా చేపట్టాలన్నారు. ప్రభుత్వం నిబంధనలప్రకారం సర్వే చేపట్టాలని ప్రజలు జనగణన సర్వేకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కిషోర్ కుమార్, పులిమామిడిసర్పంచ్ త్రివేణి చెన్నప్ప, పంచాయతీ కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply