అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ల పట్టివేత..

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం లోని పలు గ్రామాల నుంచి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను చెన్నూర్ టౌన్ సీఐ బన్సీలాల్ తమ సిబ్బంది తో కలిసి ఇవ్వాళ దాడులు నిర్వహించి పట్టుకున్నారు. మండలంలోని సుబ్బరాంపల్లి వాగు సమీపంలోని ఒక ఫామ్ హౌస్ లో అక్రమంగా నిల్వ ఉంచి రాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లు ఒక జేసీబీ ని పోలీసులు పట్టుకొని పోలీసు స్టేషన్ కు తరలించారు.
అదే.. క్రమంలో పొక్కూర్ సమీపంలో గోదావరి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ చేయగా మరో రెండు ట్రాక్టర్లు పరారీలో ఉన్నాయి.పట్టుబడ్డ మూడు ట్రాక్టర్లు ఒక జేసీబీ ని తదుపరి చర్యల నిమిత్తం మైనింగ్ అధికారులకు అప్పగిస్తామని సిఐ బన్సీలాల్ పేర్కొన్నారు.చెన్నూరు గోదావరి తీరా ప్రాంతాలనుంచి ఎలాంటి అక్రమ రవాణా జరుగుతలేదని జిల్లా మైనింగ్ అధికారులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చెప్పి నాల్గురోజులు గడవకముందే పోలీసులు అక్రమ ఇసుక రవాణా పై పోలీసులు ఏకకాలంగా దాడులు చేసి ట్రాక్టర్లు పట్టుకోవడం చర్చనీయం అంశం అయ్యింది.
