హైదరాబాద్ – గుడిమల్కాపూర్‌లోని కింగ్స్ ప్యాలెస్‌లో నిర్వహించిన ఆనం మీర్జా ఎక్స్‌పోలో కాల్పుల కలకలం రేగింది . ఓ వ్యక్తి ఉన్నట్టుండి కాల్పులు జరిపిన ఘటన నేటి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుడి మల్కాపూర్ లోని ఓ ఎక్స్‌పో లో కాల్పుల మోత మోగింది. రెండు షాపులకు చెందిన యాజమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా అకస్మాత్తుగా ఓ షాపు యజమాని తన వద్ద ఉన్న తుపాకీ తో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ హఠాత్పరిణామంతో ఎక్స్‌పో కు హాజరైన వారంతా అక్కడి నుంచి భయంతో వణుకుతూ బయటకు పరుగులు తీశారు. షాపు యజమాని కాల్పులు ఎందుకు జరిపాడు.. అసలు ఏం జరిగిందనే విషయాలపై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్నారు. ఈ కాల్పులు జరిపిన యాజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..
Gun Firing – హైదరాబాద్ లో కాల్పుల కలకలం..
