Gudur | పోలియో చుక్కలు తప్పక వేయించాలి

Gudur | గూడూరు, ఆంధ్రప్రభ : అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి 5 సంవత్సరాల చిన్న పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని గూడూరు మండలం డీసీ చైర్మన్ పోతన లక్ష్మీ నరసింహస్వామి నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక నాయకులు, అంగన్వాడి, ఆశా కార్యకర్తలు విధిగా ఈ రోజు 21న ఆదివారం ఉదయం నుంచే చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు ఎన్ ఏ బేగ్, బాసం సెట్టి విజయ్, సీ హెచ్ ఓ ఎమ్మెల్ హెచ్ పీ వేదశ్రీ , వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
