నీటి ప్రాజెక్టుల అభివృద్ధి..

నీటి ప్రాజెక్టుల అభివృద్ధి..
ఇరిగేషన్,డ్రైనేజీ, విద్యుత్ శాఖలు,నీటి సంఘాలతో…. సమావేశమైన ఎమ్మెల్యే రాము
తూడు తొలగింపు పనుల్లో….నీటి సంఘాల అలసత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే….
సమస్యల పరిష్కారానికి ముందస్తు ప్రణాళికలు
క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కాలువల్లో అభివృద్ధి పనులు పరిశీలిస్తా
వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చెరువులు నింపుతాం
నియోజకవర్గంలోని కీలకమైన ఆక్వా సాగుకు అవసరమయ్యే సాగునీరు అందించేందుకు కృషి
గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ నియోజకవర్గంలోని నీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టితో కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. అధికారులు, నీటి సంఘాల సమన్వయంతో సమస్యల పరిష్కారానికి ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నామని,తానే స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తానని చెప్పారు.

గుడివాడ పట్టణం ఏలూరు రోడ్డులోని ప్రజా వేదిక కార్యాలయంలో…. నియోజకవర్గ పరిధిలోని నీటి సంఘాల కమిటీలు,డీసీ చైర్మన్లు, ఇరిగేషన్, డ్రైనేజీ, విద్యుత్ శాఖల అధికారులతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మంగళవారం సమావేశం అయ్యారు.
సాగునీటి ప్రాజెక్టుల సమస్యల వివరాలను…. సమావేశంలో పాల్గొన్న నీటి సంఘాల కమిటీ సభ్యులు, డిసి చైర్మన్లను మండలాల వారిగా అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యే రాము అధికారులతో మాట్లాడారు. ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించిన ఎమ్మెల్యే రాము, ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి అంచనాలు రూపొందించాలని అధికారులకు సూచించారు.
ముఖ్యంగా కాలువల నిర్వహణ,తూడు తొలగింపు పనుల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా, బాధ్యతతో పనిచేస్తూ ముందస్తు చర్యలు తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న నీటి సంఘాల పెద్దలకు ఎమ్మెల్యే రాము చెప్పారు. గత ఏడాది చక్కటి ఫలితాలు వచ్చాయని, ఏడాది నీటి సంఘాల అలసత్వంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
సాగునీరు అందక కోట్లలో నష్టపోతున్నామని, సమావేశంలో పాల్గొన్న ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ తమ సమస్యలను ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ…. నియోజకవర్గంలో ప్రధానమైన వడ్లమన్నాడు డ్రైన్,…చంద్రయ్య కాలువ,దోసపాడు చానల్,నెహ్రాలి ఇలా ప్రధానమైన ప్రాజెక్టులతో పాటుగా,పంట కాలువల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
నీటి సంఘాలు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో గ్రామాల్లో త్రాగునీటి సమస్య లేకుండా చెరువులు నింపాలన్నారు. నియోజకవర్గంలో ప్రధానమైన ఆక్వా రైతులకు సరిపడా నీరు అందేలా కృషి చేస్తున్నామన్నారు. ఈ ఏడాది కాలువల్లో తూడు తొలగింపు పనుల్లో కొంత అలసత్వం కనిపించిందని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కాలువల్లో అభివృద్ధి పనులను సమీక్షిస్తానని ఎమ్మెల్యే రాము చెప్పారు.
గుడివాడ నియోజకవర్గంలో ప్రధానమైన ఆక్వా రైతాంగ సాగుకు సరిపడా నీరు అందిస్తామని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
నందివాడ మండలంలో 31 వేల ఆక్వా సాగు అధికారంగా సాగు అవుతుందని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆక్వా డిజిటల్ ట్రేసబులిటీ పైలెట్ ప్రాజెక్టు కూడా నందివాడ మండలంలో చేపట్టిన నేపథ్యంలో ఆక్వా రైతాంగ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
ఇరిగేషన్, డ్రైనేజీ అధికారులు ఈఈ ఆంజనేయ ప్రసాద్, డిఈ సూర్య భారత్, డిఈ నాగేంద్ర కుమార్, ఏఈ లు అనిల్, అరుణ్,కుమార్,నిర్మల,లక్ష్మి,బేగ్, శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్,DC చైర్మన్లు యార్లగడ్డ రవి, బొమ్మనబోయిన ఏసు, వెంకట బసవ కుటుంబరావు, మళ్లీపెద్ది సుబ్రమణ్యం, వెంకట శివ నాగాంజనేయులు, పాలడుగు నానారావు, గుడివాడ మండల టిడిపి అధ్యక్షుడు వాసే మురళి, ఆక్వా రైతులు, నీటి సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
