Chief Minister | 99రోజులు జిల్లాను విడిచి వెళ్లొద్దు..

Chief Minister | 99రోజులు జిల్లాను విడిచి వెళ్లొద్దు..
Chief Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జిల్లా కలెక్టర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న సదస్సులో పరిపాలనలో వేగం, సమన్వయం, లక్ష్య సాధనపై కలెక్టర్లకు సీఎం కీలక దిశానిర్దేశం చేస్తున్నారు.
ఈసందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… పలువురు కలెక్టర్లు హెడ్ క్వార్టర్ల లో ఉండడం లేదన్నారు. 99రోజుల పాటు జిల్లాను విడిచి వెళ్లొద్దని సీఎం ఆదేశించారు. రాజధాని శివారు జిల్లాల కలెక్టర్లు.. సీఎస్ కె.రామకృష్ణారావు అనుమతి లేకుండా హైదరాబాద్ వస్తున్నారన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో వేగం పెంచే లక్ష్యంతో ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక పేరుతో 99 డేస్ యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతోందన్నారు. జిల్లాల్లో బాగా పని చేసిన కలెక్టర్లకు సీఎం గ్రేడింగ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా మీటింగ్‍లో పనితీరు ఆధారంగా కలెక్టర్లకు సీఎం గ్రేడింగ్ ఇవ్వనున్నారని ఆశించిన మేరకు పని తీరు చూపని కలెక్టర్లకు దిశానిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
