పామర్రులో కార్డెన్ అండ్ సెర్చ్..

పామర్రులో కార్డెన్ అండ్ సెర్చ్..
పామర్రు, ఆంధ్రప్రభ : పామర్రు రావిహరిగోపాల్ నగర్ లో రాష్ట్ర పోలీస్ శాఖ ఈగల్ టీం ఆధ్వర్యంలో ఆపరేషన్ వజ్ర ప్రహార్ కార్యక్రమంలో భాగంగా కార్డెన్ అండ్ సెర్చ్ ను శనివారం చేపట్టారు. సుమారు 150మంది పోలీసు, ఈగల్ టీం ఆధ్వర్యంలో ఈగల్ టీం ఎస్పీ మహేశ్వరాజు పర్యవేక్షణలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈగల్ టీం ఎస్పీ మహేశ్వరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పోలీసు శాఖ,డీజీపీ, ఈగల్ టీం ఐజీ ఆదేశాలమేరకు కార్డెన్ సెర్చ్ నిర్వహించాము. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్. వజ్ర ప్రహార్ కార్యక్రమంలో భాగంగా 90ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.

ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గాంజా సేవించే వారైనా, అమ్మే వారైనా వారి ఇళ్లలో సోదాలు నిర్వహించడం జరిగిందన్నారు. రావి హరిగోపాల్ నగర్లో పోలీస్ టీమ్, ఈగల్ టీం ఆధ్వర్యంలో 32 సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్ చేశామన్నారు. స్థానిక ప్రజలతో గాంజా వొద్దు బ్రో, డ్రగ్స్ వొద్దు అనే నినాదంతో ప్రతిజ్ఞ చేయడం జరిగిందన్నారు. మాదకద్రవ్యాలకు ఎవ్వరూ బానిస కావద్దని ఆయన వారికి సూచించారు.
