అధైర్యపడొద్దు.. అండగా ఉంటా.

సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
పాయకాపురం, ఆంధ్రప్రభ : అధైర్యపడొద్దు అండగా ఉంటానని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు క్రైస్తవ సోదర సోదరీమణుల గురించి అన్నారు. ఎస్. సి కులాలకు చెందిన వారు క్రైస్తవంలోకి వెళ్లడం పట్ల హోదా రద్దు అనే అంశంపై ఎమ్మెల్యే బొండా ఉమా స్పందించారు.మీ హక్కుల కోసం పాటుపడతానని ఆయన పేర్కొన్నారు. సింగ్ నగర్‌లోని శాసనసభ్యుల కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభ సందేశాన్ని అందించే ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ ప్రేమ, శాంతి, క్షమాగుణం, సేవాభావం అనే గొప్ప విలువలను ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచానికి బోధించారని పేర్కొన్నారు.ప్రతి మతాన్ని సమానంగా గౌరవించడం, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో బెజ్జం జైపాల్, మద్దాల చక్రవర్తి, దివి ఉమామహేశ్వరరావు, వేల్పుల రాజేష్, రత్నబాబు, బుదాలసురేష్, గడ్డం సామ్యూల్, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.