సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకున్న ప్రభుత్వ విప్..

మోపిదేవి, ఆంధ్రప్రభ ; మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సంప్రదాయాల ప్రకారం స్వామివారిని దర్శించుకున్న యార్లగడ్డ ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం అందజేయగా, దేవస్థాన అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని ఆకాంక్షించారు.