నూతన పిఎసిఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన
ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల మండల పరిధిలోని కొడాలి పిఎసిఎస్ నూతన భవన నిర్మాణానికి ఆదివారం ఉదయం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాత భవనం స్లాబ్ శిథిలావస్థకు చేరుకోవడంతో రూ.55 లక్షలతో నూతన భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
కొడాలి పిఎసిఎస్ అధ్యక్షులు గుత్తికొండ వరప్రసాద్ – గుత్తికొండ రాజ్యలక్ష్మి దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి శంకుస్థాపనకు భూమి పూజ చేశారు. రూ.30 లక్షలు బిల్డింగ్ ఫండ్, రూ.25 లక్షలు రుణంతో ఈ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
టిడిపి మండల అధ్యక్షులు తుమ్మల చౌదరి బాబు, జడ్పిటిసి సభ్యులు తుమ్మల మురళీకృష్ణ మాజీ పీఏసిఎస్ అధ్యక్షులు దాసరి వెంకట వరప్రసాద్, మాజీ పీఏసిఎస్ వెలివెల వెంకటేశ్వరరావు, పరుచూరి రామకృష్ణ, మాజీ సర్పంచ్ గుమ్మడి విజయ కుమార్, రైస్ మిల్లు దిలీప్, సభ్యులు కంఠమనేని రాజగోపాలరావు, కార్యదర్శి తుమ్మల ఆదినారాయణ, ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.
