కౌన్సిలర్‌గా అవకాశం ఇస్తే..-ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను

బీజేపీ అభ్యర్థి బూర్ల కుమార్

కష్టసుఖాల్లో పాలు పంచుకుంటాను
-నన్ను ఆశీర్వదించండి..అభివృద్ధి చేసి చూపిస్తా
-8వార్డులో విస్తృత ప్రచారం
-కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి
బీజేపీ అభ్యర్థి బూర్ల కుమార్

స్టేషన్ ఘన్ పూర్ ఫిబ్రవరి4 ఆంధ్రప్రభ: కౌన్సిలర్‌గా అవకాశం ఇస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను. కష్టసుఖాల్లో పాలు పంచుకుంటాను. ఒక్కసారి అవకాశం ఇవ్వండి..అభివృద్ధి చేసి చూపిస్తానని బీజేపీ అభ్యర్థి బూర్ల కుమార్ పేర్కొన్నారు. బుధవారం
స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని 8వార్డులో ఆయన పార్టీ కార్య కర్తలు, స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతున్నదని గుర్తు చేస్తూ బీజేపీని ఆదరించి కమలం పువ్వు పై ఓటు వేసి గెలిపించాలని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంత రం బీజేపీ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ సందర్బంగా అభ్యర్థి కుమార్ మాట్లాడుతూ..వార్డు ప్రజ లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందిస్తానని హామీ ఇచ్చా రు. ప్రచారంలో భాగంగా వార్డులోని సమస్యలను తెలుసుకుంటూ ప్రజా సేవే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేయించేందు కు కృషి చేస్తానన్నారు. రోడ్డు సౌకర్యాలు లేని ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మిస్తామని తెలిపారు. వార్డులో ప్రతి వీధికి సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మా ణానికి కృషి చేస్తానన్నారు. స్వచ్ఛ వార్డు లక్ష్యంతో పనిచేస్తూ, ప్రతి రోజూ నీటి సరఫరా అందేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. వీధి దీపాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షిస్తానని చెప్పారు. వృద్ధులు, దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని తెలిపారు. యువతలోని క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. వార్డులోని ప్రధాన సమస్యలపై సత్వర చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఎలాంటి పక్షపాతం లేకుం డా పారదర్శక పాలన అందిస్తానని స్పష్టం చేశారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానని వెల్లడించారు.