పరశురామేశ్వరుడికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
ఏర్పేడు, ఆంధ్రప్రభ : ప్రసిద్ధి గాంచిన ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలోని శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర స్వామివారిని అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గురువారం దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు ఆలయ చైర్మన్ బత్తలగిరి నాయుడు, కార్యనిర్వహణాధికారి మునిశేఖర్ రెడ్డి ఘన స్వాగతం పలికి, స్వామివారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం ఎమ్మెల్యే శ్రావణి శ్రీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనానంతరం వినాయక మండపంలో ఆలయ వేదపండితులు ఎమ్మెల్యేకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
