ప్రమాద బీమా చెక్కు అందజేత
గాయత్రి కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా బాధిత కుటుంబానికి రూ.2 లక్షల సాయం
గొల్లపల్లి, ఆంధ్రప్రభ: గొల్లపల్లిలోని గాయత్రి కోఆపరేటివ్ బ్యాంకులో ఖాతా కలిగి ఉండి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఖాతాదారుడి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల ప్రమాద బీమా చెక్కును తహసీల్దార్ అబ్దుల్ మజీద్ శనివారం అందజేశారు.
గాయత్రి కోఆపరేటివ్ బ్యాంకు గొల్లపల్లి శాఖలో నిర్భయ సేవింగ్స్ ఖాతా కలిగిన రెడపాక లచ్చవ్వ ప్రమాదవశాత్తు మృతి చెందడంతో, బ్యాంకు ప్రమాద బీమా పథకం కింద ఆమె కుటుంబ సభ్యుడు రెడపాక రాజేందర్‌కు రూ.2 లక్షల చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమంలో గాయత్రి కోఆపరేటివ్ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ నేరెళ్ల మునిందర్, వినయ్ కుమార్, చంద్రశేఖర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
