చేంగల్ గ్రామంలో మురికి కాలువల నిర్మాణానికి శ్రీకారం

పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం..

నాణ్యతతో పనులు పూర్తి చేయాలి: సర్పంచ్ మమత రాజు

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం చేంగల్ గ్రామంలో మురికి కాలువల నిర్మాణ పనులను శనివారం గ్రామ సర్పంచ్ మమత రాజు ప్రారంభించారు.

జేసీబీ సహాయంతో ప్రారంభించిన ఈ పనుల్లో సర్పంచ్‌తో పాటు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మమత రాజు మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు వర్షపు నీరు నిల్వ కాకుండా ఉండేలా మురికి కాలువల నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు.

గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాతి మోహన్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి వినయ్, కారోబార్ చందు, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.