సత్వర న్యాయం అందేలా చూడాలి

సత్వర న్యాయం అందేలా చూడాలి

  • అరైవ్ అలైవ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
  • ఐజీపీ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి

సిరిసిల్ల, ఆంధ్రప్రభ : సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలకు సత్వర న్యాయం అందేలా చూడాలని మల్టీజోన్ వన్ ఐజిపి చంద్ర శేఖర్ రెడ్డి ఆదేశించారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి,సర్కిల్ వారీగా శాంతి భద్రతల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు భద్రతాభావం కలిగేలా సమర్థవంతంగా విధులు నిర్వహించాలన్నారు.

పోలీస్ అధికారులు,సిబ్బంది చట్టాలపై లోతైన అవగాహన పెంపొందించుకోవాలని, నమోదు అయిన కేసులలో దర్యాప్తు నాణ్యతను మెరుగుపరుస్తూ ప్రజలకు వేగవంతమైన న్యాయం అందేలా పోలీస్ యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేయాలన్నారు.అన్ని పోలీస్ స్టేషన్లలో 5ఎస్ లో బాగంగా రికార్డుల నిర్వహణను సక్రమంగా ఉంచాలని,జిల్లాలో ప్రోయాక్టివ్, విజిబుల్, కమ్యూనిటీ పోలీసింగ్ పై దృష్టి సారించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై, గంజాయి వంటి మాదకద్రవ్యాలపై నిఘాను కఠినతరం చేయాలని ఆదేశించారు.

ఇంటి నుండి బయటకు వెళ్లిన ప్రతి వ్యక్తి సురక్షితంగా ఇంటికి చేరే లక్ష్యంతో చేపట్టిన “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని,రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక”లో భాగంగా అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ లు శ్రీనివాస్,నాగేశ్వరరావు, వెంకటేష్,వెంకటేశ్వర్లు,రవి, ఆర్.ఐ లు మధుకర్, రమేష్, యాదగిరి,సురేష్,పాల్గొన్నారు.

Leave a Reply