క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలం

క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలం

  • రిటైర్డ్ జేడీ లక్ష్మీ నారాయణ

ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం విజయానికి మూలమని మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.కరీంనగర్ లోని రేకుర్తిలో ఉన్న ఎలైట్ హోటల్ వేదికగా ‘రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్’ను మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే బలమైన విద్యా పునాది నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కరీంనగర్లో ఫౌండేషన్ కోచింగ్ను అందుబాటులోకి తీసుకు వస్తున్న రెసోనెన్స్ విద్యా సంస్థలను అభినందించారు.

6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యార్థులకు ప్రాథమికాంశాలను బలోపేతం చేసుకోవడానికి, ఐఐటీ-జేఈఈ, నీట్, ఒలింపియాడ్స్ వంటి పోటీ పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమవడానికి సహాయపడుతుందని తెలిపారూ. అనంతరం నిర్వహించిన అవగాహన సదస్సులో ప్రారంభ దశలోనే ప్రిపరేషన్ మొదలుపెట్టడం, సంపూర్ణ అవగాహనతో కూడిన అభ్యాసం, కెరీర్ ఆధారిత విద్యా ప్రణాళిక ప్రాముఖ్యతను వివరించారు. రెసోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు వర్రా మాట్లాడుతూ మాట్లాడుతూ అనుభవజ్ఞులైన అధ్యాపకులు, క్రమబద్ధమైన బోధనా పద్ధతులు, నిరంతర విద్యా పర్యవేక్షణతో ఫలితాల ఆధారిత విద్యను అందించడానికి రెసోనెన్స్ కట్టుబడి ఉందన్నారు.